SKLM: జిల్లా కేంద్రంలో ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్‌ను జనసేన ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు గురువారం సందర్శించారు. ఈ మేరకు కాంప్లెక్స్ ఆవరణలో పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వర్షపు నీరు నిల్వతో ప్రయాణికులకు ఇబ్బందిగా మారడంపై ఆరా తీశారు. దీనిపై తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో చర్చించారు. ఆయన వెంట సుడా ఛైర్మన్ కొరికాన రవికుమార్ ఉన్నారు.