పంజాబ్లో రూ.8 లక్షల లంచం కేసులో రోపర్ రేంజ్ డీఐజీ ఐపీఎస్ భుల్లర్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఆయన నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి రూ.5 కోట్లకు పైగా నగదు, కిలోన్నర బంగారం, అనేక ఆస్తి పత్రాలు, ఖరీదైన ఆభరణాలు, రూ.22 లక్షల వాచ్లు, రెండు లగ్జరీ కార్లు(బెంజ్, ఆడి), 40 లీటర్ల విదేశీ మద్యం, 4 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.