ప్రకాశం: కంభంలోని స్థానిక అంగన్వాడీ కేంద్రంలో గురువారం పౌష్టికాహారంపై చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ గాలమ్మ మాట్లాడుతూ.. బిడ్డ పుట్టిన గంటలోపే ముర్రుపాలు పట్టించాలని, బిడ్డకు ఆరు నెలల వరకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలన్నారు. ఆరు నెలల తర్వాత తల్లిపాలతోపాటు అనుబంధ పోషక ఆహారం అందించాలని సూచించారు.