KDP: ప్రతి ఒక్కరూ సమతుల్య ఆహారం తీసుకోవాలని కళాశాల అసోసియేట్ డీన్ మాధవ పేర్కొన్నారు. గురువారం పులివెందుల స్థానిక ఫుడ్, సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. బెంగళూరు గ్లోబల్ గ్రీన్ కంపెనీ డీజీఎం చంద్రమోహన్, ప్రొద్దుటూరు శ్రీనిధి పాల డైరీ క్వాలిటీ డిపార్ట్మెంట్ హెడ్ చంద్రశేఖర్ హాజరై ఆహార భద్రత గురించి వివరించారు.