ప్రకాశం: గిద్దలూరులో అక్రమ వేట కేసులో అటవీ అధికారులు తిమ్మయ్య అనే వ్యక్తిని గురువారం అరెస్టు చేశారు. అతను అడవిలోకి చొరబడి వన్యప్రాణిని వేటాడినట్లు దర్యాప్తులో తేలింది. అటవీ సిబ్బంది అతని వద్ద నుండి కొండముచ్చు మాంసం, నాటుతుపాకిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై తిమ్మయ్యపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు.