SRCL: హత్యాయత్నం చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు సిరిసిల్ల రూరల్ సీఐ మొగిలి తెలిపారు. సీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో గురువారం నక్క రవి, జక్కుల శ్రీనివాసును చంపేయాలనే ఉద్దేశంతో కత్తితో దాడి చేశాడన్నారు. జక్కుల శ్రీనివాస్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్కు తరలించామన్నారు.