అన్నమయ్య: రాయచోటి పట్టణంలో గురువారం సాయంత్రం మిద్దెపై నుంచి పడి స్పృహ కోల్పోయిన 3 ఏళ్ల బాలుడికి డాక్టర్ నరసింహారావు తక్షణ వైద్యం అందించారు. అనస్థీషియా డాక్టర్ శివా సూచనల మేరకు చికిత్స కొనసాగించగా బాలుడు కోలుకున్నాడు. అనంతరం కడప రిమ్స్‌కు తరలించారు. సకాలంలో స్పందించి ప్రాణాలు కాపాడిన వైద్యులకు తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.