బెంగళూరులో దారుణం జరిగింది. ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థినిపై క్లాస్మేట్ అత్యాచారానికి ఒడిగట్టాడు. ఈ ఘటన అక్టోబర్ 10న జరిగినప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడిని జీవన్ గౌడగా గుర్తించిన పోలీసులు.. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. కాలేజీ ప్రాంగణంలోనే ఈ దారుణం జరగడంపై అందరూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.