ASR: శస్త్రచికిత్సలో అనస్తీషియా పాత్ర ఎంతో కీలకమని పాడేరు ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ హేమలతాదేవి అన్నారు. గురువారం ప్రపంచ అనస్తీషియా దినోత్సవం పాడేరులో ఘనంగా నిర్వహించారు. అనస్తీషియా ద్వారా శస్త్రచికిత్సలో నొప్పిని తగ్గించడం జరిగిందన్నారు. వైద్యంలో అనస్తీషియా ఎంతో కీలకమని తెలిపారు. శస్త్రచికిత్సలను నొప్పి లేకుండా, సురక్షితంగా జరిగేలా చేస్తుందన్నారు.