TG: రాష్ట్రంలో రెండు రోజుల్లో 400 మందికి సైబర్ నేరగాళ్లు టోకరా వేశారు. తక్కువ ధరకే క్రాకర్స్ అంటూ నకిలీ వెబ్సైట్లు, APK ఫైల్స్, లింక్‌లు పంపించారు. అది నమ్మి వారి వలలో పడి 400 మంది మోసపోయినట్లు పోలీసులు తెలిపారు. దీంతో ఇటువంటి వెబ్సైట్లు, లింక్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.