KMM: ఖమ్మం నగరం క్లీన్ అండ్ గ్రీన్‌గా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఖమ్మం ముస్తఫానగర్‌లో బీసీ హాస్టల్ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఖమ్మంలో పేదల పిల్లలు బాగా చదువుకునేలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందని చెప్పారు. ప్రశాంతమైన ఖమ్మం కోసం ప్రజా ప్రభుత్వం ప్రణాళికతో పనిచేస్తుందని మంత్రి పేర్కొన్నారు.