H-1B వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్ చేసింది. 3 లక్షల మంది వ్యాపారుల తరఫున ట్రంప్‌పై వేసిన మొదటి దావా ఇదే. ట్రంప్ నిర్ణయం ఆయన అధికార పరిధిని మించిందని పేర్కొంది. వీసా ఫీజుల పెంపు వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతుందని, కార్మిక వ్యయాలు పెంచుకోవాల్సి వస్తుందని కోర్టులో వాదించింది.