WGL: మామునూరు విమానాశ్రయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా 90కోట్లు మంజూరు చేసిన నేపథ్యంలో వర్ధన్నపేట MLA కేఆర్ నాగరాజు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మామునూరు ఎయిర్పోర్ట్ విస్తరణ, టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణం, రన్వే పొడిగింపు, లైటింగ్, సెక్యూరిటీ ఫెన్సింగ్ వంటి కీలక పనుల కోసం ఈ నిధులను మంజూరు ఇస్తూ జీవో జారీ చేసిందని తెలిపారు.