WGL: గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ పరిధిలోని 58వ డివిజన్ లక్ష్మీ నగర్, శ్రీ లక్ష్మీ నగర్ కాలనీలో రూ. 1.65 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి శనివారం సాయంత్రం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు భాగస్వాములై పనులు నాణ్యతతో చేసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా నగర మేయర్ గుండు సుధారాణి పాల్గొన్నారు.