MDK: పత్తి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకొని మద్దతు ధర పొందాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. టేక్మాల్ మండలం బర్దిపూర్లో పత్తి పంటలను రైతులతో కలిసి పరిశీలించారు. జిల్లాలో 25,939 మంది రైతులు 34,903 ఎకరాల్లో పత్తి సాగు చేసినట్లు తెలిపారు. పాపన్నపేటలో సిద్ధార్థ జిన్నింగ్ మిల్లో కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.