ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ నేషనల్ గ్రీన్ కార్ప్స్ సౌజన్యంతో కళాశాల ఎకో క్లబ్ ఆధ్వర్యంలో శనివారం పర్యావరణ హిత వస్తు ప్రదర్శనను ఘనంగా నిర్వహించారు. జిల్లా సైన్స్ అధికారి కటుకం మధుకర్ హాజరై ప్రదర్శనను ప్రారంభించారు. కళాశాల విద్యార్థులు పర్యావరణ అనుకూల వస్తువులతో స్వయంగా తయారు చేసిన పలు రకాల వస్తువులను ప్రదర్శించారు.