BDK: జూలూరుపాడు మండలం మాచినేనిపేట తండ క్లస్టర్ పరిధిలో ఉన్న రైతులు తాము పండిస్తున్న పంట వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని ఏఈఓ గోపికృష్ణ శుక్రవారం ప్రకటించారు. పత్తి పంట తప్పనిసరిగా ఆన్లైన్లో తమ వివరాలను రైతులు నమోదు చేయించుకుంటే సీసీఐ కేంద్రాల వద్ద పత్తి కొనుగోలు చేస్తామని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.