KMM: సింగరేణి మండలంలో శనివారం ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటించనున్నట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే అప్పాయిగూడెం గ్రామపంచాయతీ నూతన కార్యాలయ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని చెప్పారు. అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే పర్యటనను విజయవంతం చేయాలని కోరారు.