ఉమ్మడి అనంతపురం జిల్లాలో రానున్న ఐదు రోజుల్లో చిరుజల్లులతో కూడిన తేలిక పాటి వర్షాలు కురుస్తాయని రేకులకుంట వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు విజయ శంకర్ బాబు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. వచ్చే 5 రోజుల్లో పగటి ఉష్ణోగ్రతలు 31.7°, రాత్రి ఉష్ణోగ్రతలు 23.6° డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉందన్నారు. దీంతో జిల్లా ప్రజలు కాస్త అప్రమత్తంగా ఉండాలన్నారు.