MHBD: గార్ల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇవాళ MHBD, బయ్యారం మండలాల 69వ జోనల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా MLA కోరం కనకయ్య హాజరై, రిబ్బన్ కట్ చేసి పోటీలను శుభారంభం చేశారు. క్రీడలు మానసిక ఉల్లాసం, ఉత్తేజం కలిగిస్తాయని, గెలుపు-ఓటములు సహజమని, క్రీడా స్పూర్తితో ఉన్నత శిఖరాలు చేరాలని ఆయన సూచించారు.