AKP: దీపావళి పండుగను ప్రజలు ఆనందంగా సురక్షితంగా జరుపుకోవాలని ఎస్పీ తుహీన్ సిన్హా విజ్ఞప్తి చేశారు. పిల్లలు బాణసంచా కాల్చేటప్పుడు తల్లిదండ్రులు లేక పెద్దలు దగ్గర ఉండాలన్నారు. అనుమతి లేకుండా బాణసంచా తయారుచేసినా, నిల్వ ఉంచినా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. లైసెన్స్ ఉన్న దుకాణదారులు మాత్రమే బాణసంచా విక్రయాలు జరపాలన్నారు.