MBNR: బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీసీ బంద్‌కు బీఆర్ఎస్ పార్టీ సంఘీభావం తెలుపుతూ నేడు బంద్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ వీ. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అమలుచేసి తీరాలని డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం చేస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు.