MNCL: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ కుమార దీపక్ అన్నారు. అదనపు కలెక్టర్ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్, అధికారులతో కలిసి వరి ధాన్యం కొనుగోలుపై సన్నాహక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో లక్ష 57వేల 642 ఎకరాలలో వరి సాగు జరుగుతుందని, 3లక్షల58వేల970 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అంచనాఉందన్నారు.