ADB: పరిశుభ్రంగా ఉంచుతేనే వ్యాధులు రాకుండా ఆరోగ్యంగా ఉంటామని సబ్ యూనిట్ అధికారి పవార్ రవీందర్ అన్నారు. శుక్రవారం ఇచ్చోడ మండలంలోని జామిడి గ్రామంలో ‘డ్రైడే- ఫ్రైడే’ నిర్వహించారు. నిల్వగా ఉన్న మురుగు నీటిని శుభ్రపరిచారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ సింగ్, వసంత్, సుభాష్, ఆశ కార్యకర్త సవిత తదితరులు పాల్గొన్నారు.