బీహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ.. లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ RJD తరపున నటుడు మనోజ్ బాజ్పాయ్ ప్రచారం చేస్తున్నట్లు వీడియో ఒకటి SMలో వైరల్ అవుతోంది. దీన్ని స్వయంగా లాలూ తనయుడు తేజస్వి యాదవ్ షేర్ చేయడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై నటుడు మనోజ్ తీవ్రంగా స్పందించారు. అది ఫేక్ వీడియో అని, అందులో ఉన్నది తాను కాదని స్పష్టం చేశారు.