BDK: ఇసుక అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నా, అక్రమార్కుల తవ్వకాలు ఆగడం లేదు. శుక్రవారం ఉదయం మణుగూరు మండలం అనంతారం ప్రాంతంలో ఇసుక అక్రమ తోలకాలు జరుగుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు.