కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ తెలుగులో మరో ఆఫర్ దక్కించుకున్నట్లు వార్తలొస్తున్నాయి. రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్, దర్శకుడు విక్రమ్ కే కుమార్ కాంబోలో సినిమా రాబోతున్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో రుక్మిణి కథానాయికగా నటించనున్నట్లు సినీ వర్గాల్లో టాక్. కాగా, దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.