BDK: భద్రాచలంలో సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC) డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛభారత్ కార్యక్రమం శుక్రవారం జరిపారు. ఈ సందర్భంగా CWC అధికారులు, ఉద్యోగులతో కలిసి రామాలయం పరిసరాల్లో రోడ్లను శుభ్రం చేశారు. అలాగే స్థానిక ప్రజలకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ప్లాస్టిక్‌ను వినియోగించడం వల్ల అనేక సమస్యలు వస్తాయని అధికారులు తెలిపారు.