నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని పాత కలెక్టర్ కార్యాలయంలో పారిశుద్ధ్యం పూర్తిగా లోపించింది. కార్యాలయ పరిసరాలు చెత్తాచెదారంతో నిండిపోవడంతో, అధికారులు దోమలు, విష కీటకాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి, సిబ్బందితో పరిసరాలను శుభ్రం చేయించాలని, అధికార భవనంలోనే ఇలా ఉంటే సామాన్య ప్రజలను పట్టించుకుంటారా అని స్థానికులు పేర్కొన్నారు.