MLG: వెంకటాపురం మండలం నూగురు సబ్ సెంటర్ పరిధిలోని చిన గంగారం, మైతాపురం గ్రామాలలో ఇవాళ మాత శిశు సంరక్షణ వైద్యాధికారి డాక్టర్ భాస్కర్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో బాలింతలకు, గర్భవతులకు, అలాగే జ్వర పీడితులను గుర్తించి రక్తపూత సేకరణ ఆర్టిటి నిర్ధారణ పరీక్షలు చేశారు. వ్యాధిగ్రస్తులకు నెలవారి మందులను అందజేశారు.