ASR: ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్‌తో నకిలీ మద్యం గుర్తించవచ్చని అరకు ఎక్సైజ్ సీఐ శ్రవణ్ కుమార్ తెలిపారు. ప్రజల అవగాహన కోసం ఈ యాప్‌ను ఏపీ ప్రభుత్వం అందుబాటులో తెచ్చిందన్నారు. మద్యం కొనుగోలు చేసే వారు తమ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకుని మద్యం సీసాపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే మద్యం బాటిల్ తయారీ, నాణ్యత వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు.