కోనసీమ: సఖినేటిపల్లి మండలం అంతర్వేది గ్రామములో వేంచేసియున్న శ్రీలక్ష్మినరసింహస్వామి వారిని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే S.V.S.N.వర్మ గురువారం దర్శించారు. వీరికి ఆలయ అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి , వేదాశీర్వచనం అందించారు. స్వామివారి దర్శన అనంతరం ఆలయ సూపర్డెంట్ పీ.విజయసారధి స్వామివారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.