NLG: బర్త్ సర్టిఫికెట్ల, ఇతర సర్టిఫికెట్ల కోసం డబ్బులు వసూలు చేస్తున్న మీ సేవ నిర్వాహకులు, మున్సిపల్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంఘం జిల్లా కార్యదర్శి మల్లం మహేష్, పట్టణ అధ్యక్షుడు పాలాది కార్తీక్, కార్యదర్శి గుండాల నరేష్ ఇవాళ నల్గొండ మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు.