WGL: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశానికి మంత్రి కొండా సురేఖ గైర్హాజరయ్యారు. కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో భేటీ అయిన ఆమె సచివాలయానికి రాకుండా బయటకు వెళ్లిపోయారు. మిగతా మంత్రులందరూ సమావేశంలో హాజరయ్యారు. ఇటీవల ఆమె చుట్టూ నెలకొన్న వివాదాలు, రాజకీయ ఒత్తిళ్లతో సురేఖ మంత్రివర్గ సమావేశానికి దూరంగా ఉన్నట్లు సమాచారం.