VZM: విజయనగరంలోని కొత్తాగ్రహారం వాటర్ ట్యాంకు వద్ద పంపింగ్ వాల్ మరమత్తులకు గురైంది. ఈమేరకు ఆయా ప్రాంతాలలో శని, ఆదివారాల్లో తాగునీటి పంపిణీకి అంతరాయం ఏర్పడనున్నదని నగరపాలక సంస్థ కమిషనర్ పల్లి నల్లనయ్య శనివారం ఓ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. మరమత్తు పనులు ఇప్పటికే చేపడుతున్నామని అవి పూర్తి అయిన తక్షణమే నీటి పంపిణీని పునరుద్ధరిస్తామని తెలిపారు.