కోనసీమ: గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు కావాల్సిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రాష్ట్రీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా రావులపాలెం సీఆర్సీలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని గర్భిణీ స్త్రీలకు సామూహిక సీమంతాలు నిర్వహించారు.