E.G: జగ్గంపేట స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలో రవాణా శాఖ నిర్వహించిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్ మోటార్ సైకిల్, ఆటో డ్రైవర్లతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ ఛైర్మన్ జ్యోతుల నవీన్ ముఖ్యఅతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు.