MHBD: కురవి మండలానికి చెందిన పెండెం బచ్చమ్మ (105) మృతదేహాన్ని వైద్య విద్యార్థుల కోసం మహబూబాబాద్ మెడికల్ కాలేజీకి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు ఇవాళ అప్పగించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షుడు డా.బి. వీరన్న, పాత్రికేయుడు గుంటి సురేష్ ప్రమేయంతో ఈ ఆదర్శ చర్య సుసాధ్యమైందన్నారు. సమాజ సేవ కోసం తీసుకున్న ఈ నిర్ణయం ఆదర్శప్రాయమని పలువురు ప్రశంసించారు.