AP: మద్యం కేసు నిందితుల బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ఏ1 రాజ్ కసిరెడ్డి, ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి బెయిల్ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాజ్ కసిరెడ్డి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి, ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ్ లుథ్రా వాదనలు వినిపించారు. ఇరు వైపు వాదనలు విన్న కోర్టు విచారణను రేపటికి వాయిదా వేసింది.