SRPT: సీపీఆర్(కార్డియో పల్మ్నరీ రిసోర్టేషన్) ప్రక్రియను ఉపయోగిస్తే భవిష్యత్తులో గుండెపోటు మరణాలను తగ్గించొచ్చని కలెక్టర్ తేజస్ అన్నారు. ఇవాళ కలెక్టర్ కార్యాలయంలో సిబ్బందికి సీపీఆర్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యవసర సమయాల్లో సీపీఆర్ చేస్తే ప్రాణాలను కాపాడే అవకాశముందన్నారు. సీపీఆర్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.