NLG: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. వానాకాలం ధాన్యం సేకరణపై గురువారం ఆమె కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించారు. ధాన్యం సేకరణకు సంబంధించి కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన పవన్ నెంబర్ 9281423653 కు ఫిర్యాదులను తెలియజేయవచ్చని పేర్కొన్నారు.