MDK: నర్సాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న ముగ్గురు ఉపాధ్యాయులను జిల్లా విద్యాధికారి డాక్టర్ రాధా కిషన్ సస్పెండ్ చేశారు. ఉన్నత పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఒక ప్రధానోపాధ్యాయుడు, ఇద్దరు ఉపాధ్యాయులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించారన్న సమాచారంతో విచారణ చేపట్టిన డీఈవో వారిని గురువారం సస్పెండ్ చేస్తున్నట్టు ప్రకటించారు.