సత్యసాయి: గాండ్లపెంట మండలం చిన్నమిట్టలోని శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ పనులను ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పరిశీలించారు. ఆలయానికి సిమెంట్ రోడ్డు, ప్రహరీ గోడ అవసరమని కమిటీ సభ్యులు కోరగా, ప్రభుత్వం ద్వారా వీటిని ఏర్పాటు చేయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయం అందిస్తానని తెలిపారు.