KNR: కమిషనరేట్ పరిధిలో మోటార్ వెహికల్ యాక్ట్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు CP గౌష్ ఆలం తెలిపారు. ఇప్పటివరకు 50కి పైగా చలానాలు పెండింగ్లో ఉన్న 301 మంది వాహనదారుల నుంచి మొత్తం రూ.64,39,715 జరిమానా వసూలు కావాల్సి ఉందని పేర్కొన్నారు. పెండింగ్ చలానాలు కలిగిన వాహనదారులు వాటిని తక్షణమే చెల్లించాలని అన్నారు.