KNR: తిమ్మాపూర్ ఆదర్శ పాఠశాలలో ఎంపీసీ ప్రథమ సంవత్సరం చదువుతున్న యు.ప్రణతి కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. ఈ సందర్భంగా విద్యార్థిని ప్రణతిని ప్రిన్సిపల్ వనజ, పీఈటీ నాగరాజు, ఉపాధ్యాయులు శుక్రవారం అభినందించారు. విద్యార్థులంతా చదువుతో పాటు ఆటపాటల్లోనూ రాణించాలని ప్రిన్సిపల్ వనజ ఈ సందర్భంగా ప్రణతిని అభినందిస్తూ ప్రోత్సహించారు.