ADB: డీసీసీల నియామక ప్రక్రియలో భాగంగా కర్ణాటక MLA, ఏఐసీసీ పరిశీలకులు అజయ్ సింగ్ జిల్లాలో శుక్రవారం పర్యటించారు. DCC ఎంపికపై కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని అజయ్ సింగ్ తెలిపారు. కష్టపడే ప్రతి ఒక్కరికి పార్టీలో సముచిత గౌరవం ఇవ్వటం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో కంది శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు తదితరులున్నారు.