అనంతపురంలోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో రోగులు అవస్థలు పడుతున్నట్లు శుక్రవారం మీడియాకు తెలిపారు. చికిత్స అనంతరం ఆరు బయట, కటిక నేలపై నిద్రించే పరిస్థితి నెలకొందని వాపోయారు. ఆసుపత్రిలో పడకలు ఉన్నప్పటికీ తమకు బెడ్స్ కేటాయించలేదని రోగులు ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యాధికారులు స్పందించాలని ఆసుపత్రికి వచ్చే రోగులు కోరారు.