KRNL: రైతులకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో గుండ్రేవుల ప్రాజెక్టు సాధనపై ఐక్య పోరాటానికి KPS రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీహర్ష తెలిపారు. ఈ సమావేశం రేపు బిర్లా కాంపౌండ్‌లోని KPS కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు, రైతు సంఘాల నాయకులు, విద్యార్థి నేతలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.