GNTR: అమరావతి ప్రాంత రైతులు, రైతు కూలీల సమస్యల పరిష్కారం కోసం శుక్రవారం తుళ్లూరులోని CRDA కార్యాలయంలో ‘గ్రీవెన్స్ డే’ నిర్వహించనున్నారు. అడిషనల్ కమిషనర్ భార్గవ్ తేజ ఈ విషయాన్ని తెలియజేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, రైతులు, అమరావతి ప్రాంతవాసులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.