NLR: నగర పాలక సంస్థ పరిధిలో దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసుల దుకాణాల ఏర్పాటుకు పోలీస్, రెవెన్యూ, కార్పొరేషన్ అనుమతులు తప్పనిసరి అని కమిషనర్ నందన్ తెలిపారు. అనుమతులు లేకుండా ఏర్పాటు చేసే దుకాణాలను తొలగించి వేస్తామన్నారు. నిర్దేశించిన ప్రమాణాలను పాటించకుండా దుకాణాలను ఏర్పాటు చేయడం చట్టరీత్యా నేరమన్నారు.